మంత్రి నాదెండ్లతో నెల్లిమర్ల ఎమ్మెల్యే భేటి

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఈ నెల 30న జరగనున్న సేనతో సేనాని భారీ బహిరంగ సభ కార్యక్రమంపై చర్చించారు. అనంతరం మంత్రితో కలిసి ఆమె సభ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ భలోపేతమే లక్ష్యంగా సమావేశం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.