నేటి నుంచి కడపలో జనగణన స్వీయ నమోదు

నేటి నుంచి కడపలో జనగణన స్వీయ నమోదు

KDP: 2027 జనగణనలో భాగంగా కడప జిల్లా, నగరపాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణన కార్యక్రమం జరగనుంది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం దీనిని ప్రారంభించనున్నారు. మే 1 నుంచి 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారు. నగర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, కచ్చితమైన సమాచారం అందించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.