'ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి'
SRPT: వారబందీ పద్ధతిని రద్దు చేసి ఎస్సారెస్పీ నీటిని నిరంతరాయంగా విడుదల చేయాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి వీరభద్రయ్య డిమాండ్ చేశారు. ఇవాళ సూర్యాపేట నీటిపారుదల శాఖ ఈఈ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే చివరి భూములకు నీరు అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.