అమెరికాకు తలొగ్గి అసమాన ఒప్పందాలు: DYFI

NLG: డీవైఎఫ్ఎ చిట్యాల మండల మహాసభ పిట్టంపల్లిలో ఆదివారం జరిగింది. జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ హాజరై మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అమెరికాకు తలొగ్గి అసమాన ఒప్పందాలు చేసుకోబోతోందని విమర్శించారు. ఈనెల 21న అమెరికా ఉపాధ్యక్షుడు భారత్కు వస్తున్నందున ‘వాన్స్ గో బ్యాక్' నినాదాలతో నిరసన తెలియజేస్తామని తెలిపారు.