ఎస్టీ కమిషన్ సభ్యున్ని పరామర్శించిన బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్
MHBD: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి జాటోతు లచ్చనాయక్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న BJP ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ నేడు హుస్సేన్ నాయక్‌ను పరామర్శించారు. ముందుగా లచ్చనాయక్ చిత్రపటం వద్ద పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.