'కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగింది'

GNTR: భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని వాస్తవమని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి ముంపు విషయంపై వార్తలు ప్రచురించినందుకు సాక్షి చానల్ సహా కొన్ని మీడియా సంస్థలపై కేసులు పెట్టడం తీవ్రంగా ఖండించారు.