పాలీసెట్-2026కు ప్రత్యేక శిక్షణ
NLG: పాలీసెట్-2026 ప్రవేశ పరీక్షకు నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏప్రిల్ 25 నుంచి మే 12 వరకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. సివిల్, EEE, CSE, AMT కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.