'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'
కృష్ణా: మచిలీపట్నంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు ఆలస్యం కాకుండా పూర్తిచేయాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పనుల నాణ్యత తప్పనిసరిగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.