ప్రసాదాల కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు
JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఎంతో భక్తితో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మహా ప్రసాదంగా లడ్డు, పులిహోర కొనుగోలు చేస్తారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అదనపు ప్రసాదం కౌంటరు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.