జిల్లాలో రోడ్ సేఫ్టీ సమావేశం

జిల్లాలో రోడ్ సేఫ్టీ సమావేశం

కర్నూలు: జిల్లా కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం శనివారం జరిగింది. కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ సమవేశానికి నేతృత్వం వహించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో అదుపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.