పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో
ప్రకాశం: పొన్నలూరు మండలంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను సోమవారం జిల్లా విద్యాశాఖ డీఈవో రేణుక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి భద్రత అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల సమయంలో అధికారులు తీసుకున్న జాగ్రత్తలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.