రేపు విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్న మంత్రి
BPT: సంతమాగులూరులోని చవిటిపాలెం, మిన్నెకల్లు గ్రామాల్లో గురువారం విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్థన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9:45 గంటలకు చవిటిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 10:30 గంటలకు మిన్నెకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.