అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
SKLM: లావేరు మండలం బెజ్జిపురం కూడలి సమీపంలో ఆదివారం అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. నరసన్నపేట మండలం తిలారి సంత నుంచి అలమండ సంతకు ఆరు గేదెలను తరలిస్తున్న ప్రభాకరరావు, నీలకంఠంలను ఎస్సై జి. లక్ష్మణరావు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.