ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
TG: ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 10 లోపు ఫలితాలను విడుదల చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఏప్రిల్ 4, 5 తేదీల్లోనే ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాల్యుయేషన్‌లో ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది.