మత్స్యకార సంఘాల నాయకులతో మంత్రి భేటీ
NLR: జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఏర్పాటుపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులతో మంత్రి కొల్లు రవీంధ్ర ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిషింగ్ హార్బర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. ప్రైవేటు పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.