'1,068 హెక్టార్ల రైల్వే భూమి కబ్జా జరిగింది'
దేశంలో 1,068 హెక్టార్ల రైల్వే భూమి కబ్జా జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గత ఐదేళ్లలో 98 హెక్టార్ల భూమిని కబ్జా నుంచి విడిపించామని చెప్పారు. రైల్వే స్థలాలను మౌలిక వసతుల అభివృద్ధి, మల్టీ ట్రాకింగ్, వర్క్‌షాప్స్, కొత్త ప్యాసింజర్, కార్గో టర్మినల్స్‌కు ఉపయోగిస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు.