ఆలస్యమైనా.. ఆశలు నింపాయి!

నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్గాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటికి కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి.