ఈట్ స్ట్రీట్ దుకాణాలపై కఠిన నిబంధనలు

ఈట్ స్ట్రీట్ దుకాణాలపై కఠిన నిబంధనలు

TPT: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈట్ స్ట్రీట్‌లో 14 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ.. దుకాణదారులు తప్పనిసరిగా FSSAI నిబంధనలు పాటించాలని సూచించారు. నాణ్యమైన ఆహారం మాత్రమే విక్రయించాలి, నిల్వ ఆహారం వాడరాదు, అధిక ధరలు వేయరాదని తెలిపారు. పరిసరాల శుభ్రత, తడి-పొడి చెత్త వేరు చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాటించాలన్నారు.