రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గం భూత్ పూర్ మండలం వెల్కిచర్ల గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి జిల్లాకు చెందిన హార్వెస్టర్ డ్రైవర్‌ చలపతి (23) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో వచ్చిన బైక్, రోడ్డు దాటుతున్న చలపతిని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.