పోలీస్ స్టేషన్ బాత్రూంలో ఊరేసుకున్న నిందితుడు
NDL: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ దొంగతనం కేసు నిందితుడు వెంకటసుబ్బయ్య (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ట్రాక్టర్ చోరీ కేసులో శనివారం సాయంత్రం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్టేషన్ బాత్రూంలో ఉరేసుకున్నట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు. మృతుడు బి. సింగవరం నివాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ఏఎస్పీ జావలి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.