ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన  మాజీ ఎమ్మెల్యే

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి ప్రారంభించారు. ఈమాంపూర్ గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, 18 ఇండ్లను నిర్మించుకుని పూర్తి చేశారు. అల్లాడి అమృత, అల్లాడి కొమరమ్మ ఇల్లు పూర్తికాగా గృహప్రవేశాలను నిర్వహించారు.