దాతల నుంచి బాడీ ఫ్రీజర్
GDWL: రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామ ప్రజలకు దాతలు గుండ్రవుల వెంకట్రాముడు, మల్లెందొడ్డి బాలముని, కాకులారం వీరేష్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు, దూర ప్రాంతాల బంధువుల రాక వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి, వీరంతా కలిసి గ్రామనికి సుమారు రూ.50 వేల విలువైన బాడీ ఫ్రీజర్‌ను ఇవాళ అందించారు.