విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన కలెక్టర్

విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన కలెక్టర్

ఏలూరు ఆశ్రమంలో దివ్యాంగ విద్యార్థులతో కలెక్టర్ వెట్రిసెల్వి సరదాగా ముచ్చటించారు. విద్యార్థులకు దుస్తులు, విద్యా సామాగ్రి అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, దాతలు ముందుకొచ్చి వారి విద్యకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతమనేని నవ్యశ్రీ, పలువురు అధికారులు ఉన్నారు.