ట్రాన్స్ జెండర్లు దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు

ట్రాన్స్ జెండర్లు దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు

వనపర్తి పట్టణంలోని బులియన్ & మర్చంట్ స్వర్ణకార సంఘం సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాన్స్ జెండర్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. తాము వ్యాపారులను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టినట్లు అంగీకరించి, ఇకపై వారు ఇచ్చినంతే తీసుకుంటామన్నారు. ఒకవేళ దౌర్జన్యం చేస్తే పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు లిఖితపూర్వకంగా తెలిపారు.