'బాలల ప్రతిభను ప్రోత్సహించాలి'
VSP: బాలల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్. పరశురామ్ రాజు అన్నారు. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల జిల్లా స్థాయి నృత్య పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. భారతీయ కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు.