ఆడేందుకు ట్రై చేస్తా: ధోనీ

ఆడేందుకు ట్రై చేస్తా: ధోనీ

ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్న వేళ CSK ఫ్యాన్ ఈవెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 'మీరు రిటైర్ అవ్వొద్దు, 60 ఏళ్లు వచ్చినా ఆడగలరు' అని కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కోరగా.. కష్టమేనని ధోనీ అన్నాడు. 'మీ ఫిట్‌నెస్‌కు సాధ్యమే' అని హీరో బదులివ్వగా.. ట్రై చేస్తానని ధోనీ చెప్పడంతో అభిమానులంతా కేరింతలో చెన్నై మైదానాన్ని హోరెత్తించారు.