మద్యంతో ఆరోగ్యానికి నష్టం: ఎక్సెజ్ సీఐ

విజయనగరం: మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఎక్సైజ్ సీఐ పి.చిన్నంనాయుడు తెలిపారు. బొబ్బిలిలోని మేదరబంద జంక్షన్‌లో మద్యం తాగడం వలన కలిగే అనర్ధాలపై శనివారం అవగాహన కల్పించారు. మద్యపానంతో ఆర్థికంగా కుదేలవుతారని అసంఘటిత రంగ కార్మికులకు వివరించారు.