'ఛానల్ విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలి'

గుంటూరు ఛానల్ విస్తరణ, భూసేకరణ పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.75 కోట్లు, విస్తరణకు రూ.96 కోట్లను నాలుగు విడతల్లో విడుదల చేసింది. శుక్రవారం గుంటూరులో జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.