PHCలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరం

PHCలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరం

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని PHCలో ఇవాళ గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్లు మారబోయిన భాగ్యలక్ష్మి, కొండేటి శోభ మాట్లాడుతూ.. మండల గర్భిణీలు ప్రభుత్వ వైద్యశాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆరోగ్య, ఆర్థిక నష్టం పొందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గర్భిణీలు ఉన్నారు.