నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇళ్లు: కోమటిరెడ్డి

నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇళ్లు: కోమటిరెడ్డి

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, గతంలో YSR హయాంలో ఇచ్చిన రిజర్వేషన్ల తరహాలోనే అండగా ఉంటామని స్పష్టం చేశారు.