VIDEO: మధిరేలో 104 వాహనాన్ని అడ్డుకున్న గర్భిణీలు
KRNL: ఆదోని మండలం మధిరే గ్రామ ప్రజలు శనివారం 104 వాహనాన్ని అడ్డుకున్నారు. గర్భిణీలు 30 కిలోమీటర్ల దూరంలోని గజ్జహళ్లి ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దతుంబలం, పెద్దహరివరం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు దూరప్రాంతానికి వెళ్లాలని సూచించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు.