పలు విభాగాల పనితీరుపై కలెక్టర్ సీరియస్

KMM: ఖమ్మం ఆసుపత్రి పలు విభాగాల్లో పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో 259 మంది కార్మికులు ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో సగం మందే పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్ట్ గడువు ఈనెలతో ముగుస్తున్నందున 50 మందికి ఒక సూపర్వైజర్ చొప్పున బాధ్యతలు అప్పగించి పనులు చేయించాలన్నారు.