వెట్టి చాకిరి విముక్తి కోసం కాల్ చేయండి..!

HYD: వివిధ రాష్ట్రాలు, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి మాయమాటలు చెప్పి మైనర్లను HYD నగరానికి తీసుకొచ్చి వెట్టి చాకిరి చేస్తున్న పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. అలాంటి వారిని ఎక్కడైనా గమనిస్తే 8069434343 కాల్ చేసి తెలపాలని పోలీసులు సూచించారు. వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి కల్పించడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.