అంగన్వాడీల్లో ఒంటిపూట బడులు
VKB: ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఇవి కొనసాగుతాయి. అనంతరం నెలరోజుల వేసవి సెలవులపై త్వరలో స్పష్టత రానుంది. సెలవుల్లోనూ లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ ద్వారా పౌష్టికాహార పంపిణీ యధావిధిగా కొనసాగుతుంది. వేడి గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.