VIDEO: నేత్రపర్వంగా యాదాద్రి స్వామి వారి కళ్యాణం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శనివారం నిత్య కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో సుదర్శన నరసింహ హోమం అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీ నరసింహుని కళ్యాణం నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి.