ఎంట్రన్స్‌లో మెరిసిన రొంపిచర్ల విద్యార్థిని
PLD: మోడల్ స్కూల్ వీ. రెడ్డిపాలెం 6వ తరగతి ప్రవేశ పరీక్షలో రొంపిచెర్ల MPPS విద్యార్థిని పమ్మి లాస్య మేఘన సత్తా చాటింది. 100కు 95 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు MEO బ్రహ్మేశ్వరరావు తెలిపారు. విద్యార్థిని పట్టుదల, ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఫలితం దక్కిందని ఆయన ప్రశంసించారు.