ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు...

MNCL: కవ్వాల్ గ్రామంలో నేతకాని కులస్తులు పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నేతకాని కులస్తులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ పొలాల అమావాస్య. ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ పాటించే పండుగ పొలాల అమావాస్య వారి తాత ముత్తాతల కాలం నుంచి ఘనంగా జరుపుకుంటారు. పొలాల అమావాస్య రోజున బసవన్నలను అలంకరించి పూజిస్తారు.