శక్తి యాప్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఏలూరులో మహిళా చట్టాలు, POCSO act, మైనర్‌లపై జరిగే అనర్థాలను గురించి వాటి యొక్క నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు పోలీసులు వివరించారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లలో శక్తి యాప్‌ను వేసుకోవాలని సూచించారు. మహిళలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండేందుకు పోలీస్ శాఖ పలు చర్యలు తీసుకుంటుందని వివరించారు.