యువఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ రిఫరీగా కలిగిరి వాసి

NLR: కలిగిరి అంబేద్కర్ నగర్‌కు చెందిన గోసాల మహేశ్ బాబు(బాబి) యువ ఆంధ్రా ప్రో కబడ్డీ సీజన్ - 1 రిఫరీ(న్యాయనిర్ణేత)గా ఎంపికయ్యారు. రామచంద్రయ్య, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు బాబి పేదింటి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఈ సీజన్‌కి రిఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు.