ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్నూలులోని చెన్నమ్మ కూడలి వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనా స్థలంలోనే స్థానికులపైకి మరో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.