నూతన సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించిన.. MLA గండ్ర
BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో MLA గండ్ర సత్యనారాయణ రావు, నిజాంపల్లి నూతన సర్పంచిగా గెలుపొందిన సునీత- రవీందర్‌ను, నూతన వార్డు మెంబర్‌లను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA గండ్ర, వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ రవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు, రాజు, ఉపాధ్యక్షుడు మధుకర్ ఉన్నారు.