సింహాచల అప్పన్న భక్తులకు బిగ్ అలర్ట్
AP: అనకాపల్లి జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఈ నెల 25న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో జె.వెంకట్రావు తెలిపారు. చక్రవర్తి తిరుమగన్ తిరునక్షత్రం(వైష్ణవ శ్రీరామ నవమి) సందర్భంగా ఈ పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.