అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్

అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్

KMR: నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై భార్గవ్ గౌడ్ వివరాల ప్రకారం.. లింగంపేట మండలం ఎక్కపల్లి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.