పోలీస్‌స్టేషన్‌పై హైకోర్టులో పిటిషన్

పోలీస్‌స్టేషన్‌పై హైకోర్టులో పిటిషన్

TG: HYDలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2025లో 7వ ర్యాంక్ కేటాయించడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. PSకు ర్యాంకు ఇవ్వడంపై లోకహిత సొసైటీ పిటిషన్ వేసింది. పోలీస్ స్టేషన్ పనితీరు సక్రమంగా లేదని, దర్యాప్తులు సక్రమంగా సాగడంలేదని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను కోర్టు ఆదేశించింది.