నరసరావుపేటలో విద్యార్థులకు ట్రాఫిక్ పాఠాలు
PLD: నరసరావుపేట ఎస్ఎస్సీ కాలేజీలో బుధవారం ట్రాఫిక్ అవగాహన సదస్సు జరిగింది. సీఐ లోకనాథం విద్యార్థులకు రహదారి భద్రతపై దిశానిర్దేశం చేశారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ కచ్చితంగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.