'రాకాస' ట్రైలర్ రిలీజ్
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రాకాస’. హారర్ కామెడీ నేపథ్యంలో మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.