'రాష్ట్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆదర్శంగా ఉండాలి'

NLG: జిల్లా కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. పనులు సమాంతరంగా జరిగేలా చూసుకుంటూ పనుల్లో ఇంకా వేగం పెంచాలని సూచించారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ఉండాలన్నారు.