VIDEO: ఈసీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
HYD: మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ బృందం ఈసీని కోరింది.