అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
PPM: జియ్యమ్మవలస మండలంలో దారుణం ఘటన జరిగింది. అత్తింటి వేధింపులు తాళలేక వీణ అనే మహిళా తన ఆరు నెలల బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుంది. అంతకముందే ఆమె 9 పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో 'భర్త ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత అసలు రూపం బయటపడింది. బయట మంచిగా నటిస్తూ అదనపు కట్నం కోసం వేధించే వాడు. నా పరిస్థితి మరెవరికీ రాకూడదు' అని పేర్కొంది.