లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది: సీఎం
SDPT: బీఆర్ఎస్ పాలనలో లక్ష కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ఇప్పుడు కూలేశ్వరంగా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా నిలిచున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసి, వారిని రుణబాధల నుంచి విముక్తులను చేసినట్లు తెలిపారు.